వేటూరి కవి సార్వ భౌమా!

కవితాలయమున ఆశతో వెలిగిన దీపం
కవి నీ ఆఖరి శ్వాసతో ఆగిపోయింది పాపం
చేరావు గగనాల తీరం చూపుకందని దూరం
చెరువాయే కనులు గుండెలో తీరని భారం
కవితలతో చూపి ప్రతి నిత్యం మమకారం
కలత మిగిల్చి పోవడమేనా నీ ఆచారం
నేటి కవితా సైన్యం
నీ అస్తమయంతో శూన్యం
ఓ సీత కధ
ఒక సుందరుని వ్యధ
నాడు సిరిసిరి మువ్వల శబ్దం
నేడు అనంతమైన నిశ్శబ్దం
తెలుగు భాషకు నీవు చేసిన సేవ
తెలిపినది నటరాజ హృదయానికే త్రోవ
సప్తస్వరాలలో ఎన్నో వేల నీ పదాలు
రాగాలకవే నీ కానుకలైన అందాలు
రచించావెన్నో రమ్యమైన గీతాలు గేయాలు
రసికులకు తీపి గురుతులుగా మిగిల్చావు గాయాలు
కవి రాజా కవి శ్రీ కవి సార్వ భౌమా వేటూరి
కమనీయ మైన తెలుగుకి నీవే జయభేరి
నీ కవితతో సోలిపోయిన హృదయం
నీ కొరతతో గడుపుతోంది జీవితం !