వేసవి వేధించే వేళ!!!

వేసవి వేధించే వేళ
వెన్నెల వెదజల్లే బేల
నా తలపు నీవైతే
నీ వలపు నాదైతే
వలపులో ఏది ఇక తీరిక
తలపులో లేదు నాకే కోరిక ……………. వేసవి

నీవు నేను చెరి ఒక సగము
నీవు లేని క్షణమొక యుగము
నీవు తోడుంటే జగము
రసమయం ప్రతీ ఒకక్షణము…………….. వేసవి

మచ్చ లేని జాబిలి నీవు
మరువలేని కౌగిలి నీవు
మమకారపు లోగిలి నీవు
మనసైన నా చెలి నీవు…………….. వేసవి