శాకోపనిషత్తు

ఆచార్య మసన చెన్నప్ప , అధ్యక్షులు, పాఠ్య ప్రణాళికా సంఘం, తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం గత సంవత్సరం శ్రీ సుద్దాల అశోక్ తేజా గారితో కలిసి ఆస్ట్రేలియా విచ్చేసిన సందర్భంగా వారి వ్యక్తి గత అనుభవాలు మరియు అనుభూతులతో “శుకోపనిషత్తు” అనే పద్య కావ్యాన్ని రచించారు. ఈ కావ్య గ్రంధాన్ని వరుస క్రమంలో మీ కోసం ప్రచురిస్తున్నాం.

ఆస్ట్రేలియా దేశమహ్వానమును బంప
నాదరం బొప్పంగ నరిగినాము
‘రస రాగ సుధ’ యను రమ్యంపు వేదికన్
ప్రతిభను జూపించి బరగి నాము
మేల్బోర్ను, సిడ్నీల మేలైన అందాలు
కనువిందు సేయంగ గాంచి నాము
ధర్మపురి మురళి తకొండ కిచ్చిన
యాతిధ్య గౌరవ మందినాము

మల్లికేశ్వరుండు మనసిచ్చి మాట్లాడ
చంద్రసేఖరుండు చనువు జూప
వివిధ సభల యందు విరివిగా పాల్గొని
పల్లుకు తోడ మనసు గెలిచి నాము

ఉన్న పదిహేను రోజులోహోయనంగ
నుత్సవంబుగ గడిపితి; మున్నతముగ
సిడ్ని మేల్బోర్నులందలి స్నేహితులకు
తెలుగు పలుకుల వైభవ దీప్తి జూపి!