*శ్రమజీవి*

చెమటోడిన శ్రమజీవి
చెట్టుకింద సేదతీరుతూ

నీల వినీల ఆకాశం వంక అలవోకగా చూడగా
బిక్కు బిక్కు మంటూ వంటరి మేఘం కంటపడె

వెను వెంటనే లోలోతుల్లో దాగి వున్న దుఖం తన్నుకురాగా
వెక్కి వెక్కి కష్టజీవి కంట నీరు పెట్టసాగె

అంత లంతగా నివ్వెర బోయిన తెల్ల మేఘపు తునక
నల్ల నల్లగా మారి అల్లనల్లగా కురవసాగె

చల్ల చల్లని వానజల్లులొ స్వేద తనువు తడవగా
మెల్ల మెల్లగా అలసిన మనసు మురవ సాగె

ఇప్పుడా అప్పుడా అని
వేచివున్న నిద్రాదేవి ఆవహించగా

సడలి బడలిన శ్రమజీవి సుఖమున నిదుర జారె!
–కాశీరాం కట్నేని, మెల్బోర్న్