శ్రీకృష్ణ విజయము

శ్రీకృష్ణ రాయబారము! చింతలు దూరము చేసె
మునుపెన్నడు గాంచని! ఆనందము దగ్గర చేసె
కన్నులు కంతలు చేసి! చూసి తరించిరి జనుల్
విపరీతము గాదె! ఇంతలు అంతలు చేసిరి దుర్జనుల్!

మనసును మాయకప్పగ! మటుమాయమౌను శాంతియు!
శ్రీహరి కృపావీక్షణ తేజోరాశుల! తొలగును అవిద్యయంతయు!
శ్రీహరి నమ్మినవారికి తధ్యము! నెరవేరును కార్యమునంతయు!
శ్రీహరి వెలుగును హృదయంబున! జీవుల విజయసారధియై!

డా. రాంప్రకాష్ ఎర్రమిల్లి