శ్రీరామా!

రామనామమ్ము విజయమంత్రమ్ము సుమ్ము
రామనామాక్షరమ్ములే రక్షయగును
రాక్షసావళి దునిమి సురాజ్యమిచ్చు
నీయయోధ్యాధి పతి మనకెపుడు దిక్కు

దనుజసంహారమొనరించు విజయరాము
డభయమొసగెడి దైవాంశ ప్రభువతండు
జానకీరమణుండుకడు శాంతినిచ్చి
మనకు కల్యాణగుణముల ఘనతనొసగు!!

మాతారామో మత్పితా రామభద్రో
భ్రాతారామో మత్సఖా రాఘవేశః
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
నా2న్యం దేవం నైవజానే న జానే

నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మ జాయై
నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః

డా. చింతలపాటి మురళీ కృష్ణ, బ్రిస్బేన్