సంక్రాంతికి రజనీకాంత్ 'దర్బార్‌'

Darbarరజనీకాంత్‌, దర్శకుడు మురుగదాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా ‘దర్బార్‌’ సంక్రాంతి సీజన్లో విడుదల కానుంది. ఈ సినిమాలో నయన తార కథానాయిక. దిలీప్‌ తహిల్‌, సునీల్‌ శెట్టి, నివేదా థామస్‌, యోగి బాబు, తంబి రామయ్య, జతిన్‌ శర్న, నవాబ్‌ షా వంటివారు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఆ సినిమా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలియజేసింది.

‘దర్బార్‌’లో రజనీకాంత్‌, మురుగదాస్‌ కలసి చర్చించుకుంటున్న ఫొటోను షేర్‌ చేశారు. సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించింది. ఇందులో రజనీకాంత్‌ పోలీస్‌ ఆఫసీర్‌గా నటిస్తున్నాడు. మురుగదాస్‌, రజనీకాంత్‌ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా ఇది. ఈ చిత్రానికి సంతోష్‌ శివాన్‌ సినిమాటోగ్రఫీ, శ్రీధర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహించారు

Send a Comment

Your email address will not be published.