సంక్రాంతి కానుక 'యన్‌టిఆర్‌'

NTR -Biopicసంక్రాంతి కానుకగా ‘యన్‌టిఆర్‌’ బయోపిక్‌

నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్న యన్‌టిఆర్‌ బయోపిక్‌ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్‌ స్టిల్స్‌తో పాటు రెండు పాటలను కూడా విడుదల చేశారు. తాజాగా చిత్ర టైలర్‌, ఆడియో రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు.

యన్‌.టి.ఆర్‌ ట్రైల‌ర్ లాంచ్‌ డిసెంబర్‌ 16న హైద‌రాబాద్‌లో, ఆడియో రిలీజ్ ఈవెంట్ డిసెంబర్‌ 21న నంద‌మూరి తార‌క‌రామారావు పుట్టిన ఊరు నిమ్మకూరులో జ‌ర‌గ‌నున్నాయి.ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. క్రిష్ జాగ‌ర్ల‌మూడి ఈ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా యన్‌.టి.ఆర్‌ క‌థానాయ‌కుడు, యన్‌.టి.ఆర్‌ మ‌హానాయ‌కుడు పేర్లతో రెండు భాగాలుగా వ‌స్తుంది. విద్యాబాల‌న్, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, రానా ద‌గ్గుపాటి, సుమంత్, ర‌కుల్ ప్రీత్ సింగ్, లెజెండ‌రీ కైకాల స‌త్యనారాయ‌ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.