సంక్రాంతి

బోగి మంటలు లేవు, బోగి పళ్ళు కాన రావు
సంక్రాంతి ముగ్గులు లేవు, గాలిపటాలు సరే సరి
కొత్త బట్టలు లేవు, కోడి పందాలు లేవు
పువ్వులు వున్నా వాటిలో పరిమళం లేదు

లేనివి ఎటూ లేవు మరి వున్నవి ఏంటి!
ఫోన్ లో పలకరింపులు , ఎఫ్ బి లో పండగ పోస్టులు
వాట్స్ యప్ లో శుభాకాంక్షలు, వాహ చెఫ్ వంటకాలు
యూట్యూబ్ లో పంచాంగం , ఇన్స్టగ్రమ్ లో ముగ్గులు
దొరికిన దానితో దేవుడికి నైవేద్యం!

పండగ చేసే విదానం లో ఎంతో వ్యత్యాసం అయిన,
మన సంస్కృతిని నిలుపుకోవాలని ఆరాటం
సంప్రదాయాలను స్థిర పరుచుకోవాలని ఆశ
ఆచారాలను ఆచరించాలనే అభిలాష
మంత్ర ఉచ్చారణ రాకపోయినా మనసు నిర్మలం
మేమే ప్రపంచ దేశాలలో వున్న ప్రవాసులం !

~ కృష్ణ శ్రీ కాన్బెర్రా