సమ్మర్‌ కానుక ఎఫ్‌3

సమ్మర్‌ కానుక ఎఫ్‌3

సమ్మర్‌ కానుకగా మే 27న సందడి చేయనున్న ఎఫ్‌3

‘ఎఫ్‌ 2’తో మంచి వినోదాన్ని అందించి, ఇప్పుడు అంతకు మూడింతల వినోదాన్ని ఇవ్వడానికి రెడీ అవుతోంది ‘ఎఫ్‌ 3’ టీమ్‌. ఈ చిత్రం డబ్బు చుట్టూ తిరుగుతుంది. వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 28న ఎఫ్‌ 3 విడుదల చేస్తామని గతంలో చిత్రయూనిట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే! తాజాగా ఒక నెల వెనక్కు జరిగిందీ సినిమా. మే 27న సమ్మర్‌ కానుకగా రిలీజ్‌ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

‘పిల్లలు పరీక్షలు ముగించుకోండి, పెద్దలు సమ్మర్‌ సందడికై తయారుకండి.. ఫన్‌ పిక్నిక్‌కు డేట్‌ ఫిక్స్‌ చేశాం.. మే 27న ఎఫ్‌3 వస్తోంది. ఇంక డేట్‌ మార్చే ప్రసక్తే లేదు’ అని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతదర్శకుడు. తమన్నా, మెహరీన్‌ కథానాయికలుగా రాజేంద్ర ప్రసాద్, సునీల్‌ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో మూడో హీరోయిన్‌గా సోనాల్‌ చౌహాన్‌ కనిపించనున్నారు.