సెప్టెంబర్‌ 6న ‘వాల్మీకి’

సెప్టెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు ‘వాల్మీకి’

Valmiki-Varun‘ఎఫ్‌2’ లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తరువాత వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. తాజాగా విడుదల చేసిన ప్రీ టీజర్‌లో వరుణ్‌ లుక్‌ ఫ్యాన్స్‌కు షాక్‌నిచ్చింది. సెలబ్రెటీలు సైతం వరుణ్‌ లుక్‌కు ఫిదా అయ్యారు. డీజే లాంటి చిత్రం తరువాత హరీష్‌ శంకర్‌ డైరెక్ట్‌ చేస్తోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తమిళ సూపర్‌హిట్‌ మూవీ ‘జిగర్తాండ’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ నెగెటివ్‌ రోల్‌ చేస్తుండగా.. మరో కీలకపాత్రలో అథర్వా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రయూనిట్‌ ప్రస్తుతం అనంతపురంలో షూటింగ్‌ చేస్తోంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు సోషల్‌ మీడియా వేదికగా తెలిపాడు. ఈ మూవీకి మిక్కి జే మేయర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.