హంతకురాలి ఆస్వాదన

హంతకురాలి ఆస్వాదన

1762 లో రష్యాను పాలించిన జార్ చక్రవర్తి దారుణ హత్యకు గురయ్యారు. ఆ హత్యకు కుట్ర పన్నింది మరెవరో కాదు, స్వయానా ఆయన భార్యే. ఈ విషయం తెలిసి అందరూ కంగుతిన్నారు. ఆమె పేరు కాథరిన్. ఈ హత్యోదంతంలో నిందితులను గుర్తించినప్పటికీ వారికి శిక్ష పడలేదు. పైగా వారికి పదోన్నతి లభించింది.

కాథరిన్ కి చిత్రకళపై మక్కువ ఎక్కువ. లెనిన్ గ్రాడ్ లో ఉన్న ఓ రాజభవనాన్ని కళాఖండంగా మార్చాలని ఆమె కోరిక. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న గొప్ప గొప్ప కళాఖండాలను, పెయింటింగ్స్ ని తన ప్రతినిధులను పంపించి కొనిపించి తెప్పించింది కాథరిన్. వాటిని ఓ వరసక్రమం లో అందంగా తీర్చి దిద్ది హెర్మిటేజ్ అని ఆ కళాఖండానికి పేరు పెట్టింది ఆమె. అది అనతికాలంలోనే ఓ పెద్ద కళా కేంద్రమైంది.

కొన్ని సంవత్సరాల క్రితం తీసిన లెక్కల ప్రకారం అక్కడ 2500 గదులు ఉన్నాయి.ఇరవై మూడు లక్షల కళాఖండాలు ఉన్నాయి. ఆ భవనాన్ని చూసి నడిచొస్తే పదిహేను మైళ్ళు పూర్తి అవుతుందట. లోపల ఉన్న ఒక్కో కళాఖండాన్ని ఒక నిమిషం చొప్పున చూస్తూ రావడానికి కనీసం వారం రోజులు పడుతుందట.

– రేణుకా జగదీశ్

Send a Comment

Your email address will not be published.