హన్సిక లవ్ బ్రేక్

అన్నట్టు తమిళ నటుడు శింబుతో నటి  హన్సిక ప్రేమకు బ్రేక్ పడింది. వీరిద్దరి మధ్య నాలుగు నెలల క్రితమే తేడాలు వచ్చినట్టు అప్పట్లోనే కొన్ని పత్రికలూ ప్రముఖంగా ప్రచురించాయి. కానీ శింబు హన్సికతో తన ప్రేమాయణం సాఫీగానే సాగుతోందని ప్రకటనలు ఇస్తూనే వచ్చాడు. అంతే కాదు అందుకు బలం చేకూర్చే రీతిలో శింబు కొన్ని ఫోటోలు కూడా పత్రికలకు ఇస్తూ వచ్చాడు. కానీ హన్సిక వాటిపై ఒక్క మాటా మాట్లాడ లేదు. అవునని కానీ, కాదనికానీ ఆమె చెప్పలేదు. ఇప్పుడు గత వారం శింబు ఒక ప్రకటన చేసాడు…తమ ప్రేమకు బ్రేక్ పడినట్టు శింబు స్వయంగా చెప్పుకున్నాడు. అయితే రెండు వారాలకు ముందు అతనే హన్సిక తన ప్రేయసి అని చెప్పిన విషయం గుర్తుండాలి. కానీ ఇప్పుడు అతను ఎందుకు తాము విడిపోయామని చెప్పుకున్నాడు? అని ఆరా తీయగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి.

హన్సిక అమ్మకు మొదటి నుంచి శింబు అంటే గిట్టేది కాదు. శింబుపై  సరైన అభిప్రాయం లేదు. మోనా మోద్వానీ తన భర్త నుంచి డైవర్స్ తీసుకుని విడిగా ఉంటున్నారట ఆమె. ఆమె ఒంటరిగా ఉంటూ హన్సికను పెంచి పెద్ద చేసేరట. అందువల్ల తన కూతురు భవిష్యత్తుపై ఆమె ఎంతగానో ఆలోచిస్తున్నారట. అలాంటి అమ్మను నొప్పించి ప్రేమ పెళ్లి చేసుకోవడానికి ఏ కూతురు ముందుకొస్తుంది?

నాలుగు నెలలకు పూర్వమే హన్సిక అమ్మ కట్టుబాట్లలోకి వచ్చేసి శింబు కి దూరమై అతని గురించి ఒక్క మాటా మాట్లాడటం లేదు. శింబు గురించి ప్రస్తావన వస్తే ఆమె మాట మార్చేస్తోందట. కానీ శింబు అలా కాదు. తన పుట్టిన రోజుకి హన్సికా  వచ్చినట్లుగా ఫోటో విడుదల చేసాడట. కానీ ఆ ఫోటో గత ఏడాది పుట్టిన రోజు నాటి ఫోటోనట. ఈ సందర్భంలో హన్సికా ఒక ప్రకటన విడుదల చేస్తూ తాను ఆ సమయంలో హైదరాబాద్లో ఉన్నానని చెప్పారు. శింబు పుట్టినరోజు నాడు కనీసం ఆమె విషెస్ కూడా చెప్పలేదని తెలియ వచ్చింది. అంతే కాదు శింబు చెల్లెలు ఇలక్కియా పెళ్ళికి ఆమె రాలేదట. ప్రేమికుల రోజున శింబు హన్సికాను తన ప్రేయసి అని చెప్పగా హన్సికా తాను ఇంకా సింగల్ అని జవాబిచ్చింది. ఆ తర్వాత శింబు ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించగా అప్పటికప్పుడు విషయం బద్దలైంది. హన్సికా తల్లి పోలిసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళడానికి నిర్ణయించుకున్నారట. అప్పుడు శింబు తాను  కావాలా అమ్మ కావాలా అని  అడగ్గా హన్సికా తనకు అమ్మే కావాలని గట్టిగా చెప్పేసిందట. దానితో ఇక లాభం లేదనుకున్న శింబు ఇకపై పెదవుల వరకే కాదు హృదయం లోను హన్సికాతో తనకు ఎలాంటి బంధమూ లేదని స్పష్టం చేసాడు.

ఇలా ఉండగా ఇగో ప్రాబ్లం వల్లే వీరి మద్య్హ ప్రేమ పర్వం దెబ్బతిన్నట్టు సినీ వర్గాల భోగట్టా.

Send a Comment

Your email address will not be published.