హర్రర్ కామెడీ చిత్రంలో నాగార్జున!

nagarjunaనిరుడు ఓంకార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన “రాజు గారి గది” చిత్రం విజయవంతం కావడంతో ఇప్పుడు ఓ హర్రర్ కామెడీ చిత్రం తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజు గారి గది ఓ లో బడ్జెట్ చిత్రం. దానికి సీక్వెల్ గా ఈ హర్రర్ కామెడీ చిత్రం ఉంటుంది. ఈ చిత్రంలో నటించడానికి నాగార్జున నటించబోతున్నట్టు తెలిసింది.

భిన్నమైన స్క్రిప్ట్ల కోసం ఇష్టపడే నాగార్జునకు ఓంకార్ హర్రర్ కామెడీ స్క్రిప్ట్ నచ్చినట్టు వార్త!

నిజానికి ఈ హర్రర్ కామెడీ చిత్రంలో వెంకటేష్ నటిస్తే బాగుంటుందని అనుకున్నారు. అయితే ఆయన ఇతర కమిట్ మెంట్ల వల్ల బిజీగా ఉండటంతో దర్శకుడు ఓంకార్ నాగార్జునను కలిసి తన అభిప్రాయాన్ని చెప్పినట్టు అభిజ్ఞ వర్గాల మాట!

ఈ చిత్రంలో నాగార్జునతోపాటు ఓంకార్ సోదరుడు అశ్విన్ కూడా ఓ ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కావచ్చు.

Send a Comment

Your email address will not be published.