హాస్య చతురుడు కోహ్లి

క్రికెటర్స్, సినీ తారల మధ్య ప్రేమాయణాలు, పెళ్ళిళ్ళు అప్పుడప్పుడూ జరిగేవే. ఇప్పటి ఇండియన్ క్రికెట్ టీం లో ప్రముఖ బాట్స్ మాన్ గా వినుతికెక్కిన విరాట్ కోహ్లికి అతనున్న ఇంటికి చుట్టూ పక్కల వారి నుండి తమ అమ్మాయిని పెళ్లి చేసుకోమని కోరుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. నీకు అచ్చంగా మా అమ్మాయి సరిపోతుందని చెప్పే ఇళ్ళ వాళ్ళు ఉన్నారంటే అది విచిత్రమేమీ కాదు. కోహ్లి ఈ విషయాన్నీ చెప్తూ రక్తంతో ప్రేమలేఖలు రాసిన అమ్మాయిలూ ఉన్నారని చెప్పాడు ఆ మధ్య. అందుకేనేమో అతను ప్రేమిస్తున్న నటి బాలీవుడ్ లో ప్రముఖంగా తారగా ఉన్నారంటే అందులో విస్థుపొవడానికి ఏమీ లేదు. ఆమె మరెవరో కాదు, ఆమె పేరు అనుష్కా శర్మ.

వీరిద్దరూ జంటగా సినిమా కూడా తీయాలని రకరకాలుగా వార్తలు కూడా గుప్పుమన్నాయి ఉత్తర భారతంలో. ఒక షాంపూ ప్రకటనలో నటించినప్పుడు వీరిద్దరూ మిత్రులయ్యారు. భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా టూర్ కి వెళ్లి తిరిగి స్వదేశం చేరుకోవడం తోనే కోహ్లి అనుష్కా శర్మాకారులో ఆమె ఇంటికి వెళ్ళడంతో వారిపై వదంతులు గుప్పుమన్నాయి. ఆమె ఇంట్లోనే కోహ్లి కొత్త సంవత్సర వేడుకలు కూడా జరుపుకున్నాడు. దీనిని బట్టే వారి మధ్య ప్రేమ ఎంతగా ఉప్పొంగుతోందో అర్ధం చేసుకోవచ్చని ఒకటి రెండు పత్రికలూ వార్తలు రాయనే రాసాయి కూడా. ఒకటి రెండు టీవీ చానల్స్ కూడా దాదాపు ఇలాంటి వార్తలనే వారిదారి క్లిప్పింగ్స్ చూపించాయి.

షాంపూ ప్రకటనలో నటిస్తున్నప్పటి నుంచే కోహ్లి తో పరిచయముందని , అతను మా ఇంటికి రావడం నిజమే అని అనుష్కా శర్మ చెప్పింది. అయినా ఇతరులు కూడా మా ఇంటికి వచ్చారని, కానీ వార్తల్లో కోహ్లి పేరు మాత్రమే బయటకు వచ్చిందని చెప్తూ అతను ఎంతో చక్కగా మెలగుతాడని, తెలివైనవాడని, హాస్యచతురుడని కూడా ఆమె చెప్పారు.

Send a Comment

Your email address will not be published.