హిట్ కొట్టిన జైసింహ

బాలకృష్ణ, నయనతార జంటగా నటిస్తున్నారని జైసింహ టైటిల్ వెల్లడించినప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు భారీగా వచ్చాయి. ఈ చిత్రం బాలయ్య అభిమానులకు నిజంగానే సంక్రాంతి పండగ కానుకే. న‌టాషా దోషీ, హరిప్రియ, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. కె ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సి కళ్యాణ్ నిర్మించారు.
చిరంతన్ భట్ సంగీతం అందించారు.

JaiSimhaన‌ర‌సింహ పాత్రలో బాల‌కృష్ణ‌ నటించారు. ఇతను తన బిడ్డ‌తో కుంభ‌కోణం (తమిళనాడు) చేరుకుంటాడు. కుంభకోణంలో ఆలయ ప్రధాన ధ‌ర్మ‌క‌ర్తతో బాలయ్యకు పరిచయమేర్పడుతుంది. ప్రధాన ధర్మకర్తగా ముర‌ళీమోహ‌న్‌ నటించారు. ధర్మకర్త ఇంట్లోనే బాలయ్య ఓ డ్రైవరుగా చేరుతాడు.

ఇదిలా ఉండగా, ఆల‌య ఆర్చ‌కుల‌కు, పోలీసుల‌కు మధ్య జ‌రిగిన గొడ‌వ‌లలో న‌ర‌సింహం చొర‌వ తీసుకుంటాడు.

జిల్లా ఎస్పీతో అర్చ‌కుల‌కు బాలయ్య క్ష‌మాప‌ణలు చెప్పిస్తాడు.

క్షమాపణ చెప్పడమైతే చెప్పాడు కానీ ఎస్పీకి బాలయ్యపై ప‌గ పెరుగుతుంది. ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు.

ఒక హత్య కేసులో బాలయ్యను ఎలాగైనా ఇరికించాలని ఎస్పీ కుట్ర పన్నుతాడు. అయితే ఆ సమయంలో గౌరి తన బిడ్డ కోసం వైజాగు నుంటి వస్తుంది. ఆమె వచ్చిన తర్వాత ఏమైంది? అసలు గౌరి ఎవరు? బాలయ్య ఎందుకని బిడ్డను తీసుకుని కుంభకోణం వచ్చాడు? బాలయ్యపై ఎస్పీ ప్రతీకారం తీర్చుకున్నాడా? వంటి వాటికి సమాధానం తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూసి తీరాల్సిందే.

నటీనటుల విషయానికి వస్తే బాలయ్య గురించి చెప్పుకోవాలి. ఆయన నటన సూపర్ అని చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు. యువనటులకు ఏ మాత్రం తగ్గకుండా బాలయ్య చేసిన డ్యాన్సులు, ఫైట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. అమ్ముకుట్టి …అనే పాటలో పాట‌లో ఆయ‌న డ్యాన్సు అమోఘం. అలాగే డైలాగు డెలివరీ కూడా అద్భుతం. నయనతార నటన చాలా బాగుంది. నటాషా దోషి గ్లామర్‌ తో అందరినీ ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్ నటన గురించి వేరేగా చెప్పక్కర్లేదు. మురళిమోహన్ , జయ ప్రకాష్ రెడ్డి తమ తమ పాత్రలకు అన్ని విధాల న్యాయం చేశారు.

ఈ చిత్రంలో లోపమేదైనా ఉందంటే అది కామెడీ సన్నివేశాలే. హాస్యం విసిగిస్తుంది. బ్రహ్మానందం కామెడీ ఏ మాత్రం పండలేదు.

చిరంత‌న్ భ‌ట్‌ సంగీతమే కాదుస బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత గొప్పగా లేదు.

ఎం.రత్నం రచన బాగుంది. డైరెక్టర్ స్క్రీన్ ప్లే లో ఏ మాత్రం కొత్తదనం లేదు. ద్వితీయార్థం కథ సెంటిమెంటుతో నడిపించారు. అయితే ఒక్క విషయం అభిమానులను ఎలా ఆకట్టుకోవాలో తెలుసుకుని ఆ విధంగానే ఈ సినిమాను వెండితెరకెక్కించారు అనడంలో అతిశయోక్తి లేదు.

Send a Comment

Your email address will not be published.