ఆగమనం ,ఆగమనం,హుదుద్
ఆంధ్రావనికి ప్రళయ హేతుకం
ప్రక్రుతి భీభత్సం ,భీతావాహం,
ఆంధ్రమాత ఆత్మఖేదనం ॥ఆగమనమ్॥
పశు,పక్ష్య జంతు ,జాల,
వృక్ష సమూహ,పచ్చని పంటచేల
,విధ్వంసం విమానాశ్రయ, ధూమశకట.
నిర్వాసిత స్థల వ్విధ్వసం
సర్వ నాశనం,॥ ఆగమనమ్॥
హుదుద్ రాకాసి విలయ తాండవం,
నిత్యావసర పచారీసామగ్రి ,
పాలు పెరుగు, జలములు,
విద్యుత్ కొరతల లేమిల
ప్రజా జీవన స్తంభనం,
ఆపన్న హస్త శరణార్ధులై నిరీక్షణం
సౌందర్య సాగరతీర,పచ్చని
వివిధవర్ణ ఫల, పుష్ప దోటల,
శోభాయమాన విశాఖ
సౌభాగ్య,సౌందర్య వినాశం ,
ఆంధ్రావని ఆక్రోశం ,
॥ ఆగమనం హుదుద్ ఆగమనం,॥
ఆంధ్రావని సచివ దీరోదాత్తుడు
చంద్రబాబు,విసుగు విరామమెరుగక
క్షణ క్షణ పరిణామ పర్యవేక్షణా
ప్రావీణ్యం ,అవిశ్రామ సేవాక్రమం ,
“విశాఖ “జన బాహుళ్య ఆశాజనకం ,॥ఆగమమనమ్ ॥
ఇరుగు పొరుగురాష్ట్ర దేశవిదేశ సహాయ కార్యక్రమ ,
చిత్ర పరిశ్రమా ,ప్రముఖ వ్యాపార వేత్తల ,
చిరు చిరు ఉద్యోగుల సహిత విరాళం
ధన సహాయ ,సేవాపర, ఇతర వస్తు సామగ్రి ,
సహాయచర్యల ఆపన్న హస్త,
దయా సంఘీభావ ప్రభావం ,అధ్బుతం
వన్నెవన్నె శోభల బాసి విల విల లాడు
విశాఖ ఊరడిల్లు విధానం
॥ ఆగమనం హుదుద్ ఆగమనం॥॥
చంద్రబాబు జయహో ,
జయహో చంద్రబాబు జయహో,
ధన్యవాదం ధన్యవాదం
దాతలెల్లరికి ధన్యవాదం . –
——————————————————————
కామెస్వరి.సాంబ మూర్తి .భమిడిపాటి .
పి.ఎ. యు.ఎస్.ఎ.