అన్నదమ్ములుగా మరోసారి

అన్నదమ్ములుగా మరోసారి

అన్నదమ్ములుగా మరోసారి చిరంజీవి, రవితేజ

మెగాస్టార్‌ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఈ ఏడాది తన సినిమాలతో అభిమానులను అక్లరించనున్నారు. చిరు తనయుడి రామ్‌ చరణ్‌తో నటించిన ‘ఆచార్య’ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీంతోపాటు గాడ్ ఫాదర్‌, భోళా శంకర్‌, బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు చిరంజీవి. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ను పరిశీలిస్తోందట చిత్రబృందం. వైజాగ్‌ షిప్‌ యార్డ్ నేపథ్యంలో మాస్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కనుందని సమాచారం.

అయితే ఈ చిత్రంలో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో చిరంజీవికి తమ్ముడిగా రవితేజ అలరించనున్నాడని సమాచారం. రవితేజ పాత్ర సుమారు 40 నిమిషాలు ఉంటుందని పుకార్లు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే సుమారు 22 ఏళ్ల తర్వాత చిరు, రవితేజ కలిసి మరోసారి అన్నదమ్ముల పాత్రలో అలరించున్నారు. 2000 సంవత్సరంలో వచ్చిన బ్లాక్ బస్టర్‌ చిత్రం ‘అన్నయ్య’లో చిరంజీవి, రవితేజ, వెంకట్‌ అన్నదమ్ములుగా యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో చిరంజీవి అండర్‌ కవర్‌ పోలీస్‌ పాత్రలో నటించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగే అవకాశం ఉంది.