150 దేశాల్లో ‘ఆకాశం నీ హద్దురా’

‘సింగం’ నటుడు సూర్య ఇప్పుడు సరికొత్త నిర్ణయం తీసుకొన్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘సూరారై పొట్రు’ (‘ఆకాశం నీ హద్దురా’) చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి సన్నద్ధమయ్యారు. తెలుగు వ్యక్తి సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితాధారంగా రూపొందుతోంది. ఇందులో మోహన్‌ బాబు తన అసలు పేరైన భక్తవత్సలం నాయుడుగా ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, పరేష్‌ రావల్‌, ఊర్వశి, వివేక్‌ ప్రసన్న తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులో సినిమా థియేటర్లు తెరుచుకొనే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చిత్రనిర్మాణ సంస్థ ఓటీటీ వైపే మొగ్గు చూపడంతో తమిళనాడులోని థియేటర్ల యాజమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అయినా సూర్య మాత్రం చిత్రాన్ని అక్టోబర్‌ 30న అమెజాన్‌ ప్రైమ్‌లో భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు తొలుత చిత్రాన్ని 150 దేశాల్లో విడుదల చేయాలనుకున్నారు. అయితే చిత్ర నిర్మాత రాజశేఖర్‌ పాండియన్‌ మరో కొత్త వార్తను తెరమీదకు తీసుకొచ్చారు. చిత్రాన్ని సుమారు రెండు వందల దేశాల్లో స్ట్రీమింగ్‌ చేస్తామని తెలిపారు. మొత్తం మీద ఈ ఏడాదిలో వేసవి కాలం దాటినపోయిన కూడా సినిమా థియేటర్ల సందడి మాత్రం తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలు ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నాయి.

Send a Comment

Your email address will not be published.