All Sahityam

అలెగ్జాండర్ ప్రేమ

ఈ ప్రపంచాన్ని గెలవాలనే లక్ష్యంతో అలెగ్జాండర్ సైన్యంతో ప్రపంచం మీదకు వెళ్ళాడు. ఆయన పారసీకాన్ని గెలిచిన తర్వాత మరో దేశం మీద దండెత్తాడు. ఆ దేశానికి వెళ్ళే దారిలో ఎన్నో అడవులు ఉన్నాయి. అలాగే మధ్యలో వచ్చిన నదులను దాటి ముందుకు సాగవలసి వచ్చింది.

Read More »

పాదుకా పురాణమా?

పశ్చిమ బెంగాల్లో విచిత్రా అనే ఒక సాహితీ సంస్థ ఉండేది. అది విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ ఆధ్వర్యంలో నడిచేది. ఆ సాహితీ సంస్థ క్రమం తప్పకుండా సాహితీకార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండేది.

Read More »

మొదటి డబ్బింగ్ రచయిత శ్రీశ్రీ

హిందీలో వచ్చిన నీరా ఔర్ నందా అనే హిందీ సినిమాని తెలుగులో డబ్ చేసినప్పుడు ఆ సినిమాకి మాటలు, పాటలూ రాసింది శ్రీశ్రీయే. ఈ సినిమా తెలుగులో ఆహుతి పేరుతో వచ్చింది.

Read More »

నాటకాల వేదికల ఏర్పాటు

ఇంగ్లాండ్ లో మొట్టమొదటి నాటక వేదిక 1576 లో నిర్మించారు. ఇంగ్లాండ్ రాజధాని లండన్ శివారులో ఈ వేదికను ఏర్పాటు చేశారు. ఈ శతాబ్దంలోనే తేమ్స్ నదికి ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో మొత్తం ఎనిమిది నాటక వేదికలు నిర్మించారు.

Read More »

ఆయనకాయనే సాటి

గాంధీజీ రెండవ సుపుత్రుడు మణిలాల్. ఆయన చాలా కాలం దక్షిణాఫ్రికాలో ఉన్నారు. ఆయనకు చాలా కాలం పెళ్లి కాలేదు.

అప్పట్లో భారత దేశంలో ఉన్న తన తండ్రి గాంధీజీకి మణిలాల్ ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో ఆయన తనకు ఒక భారతీయ యువతినే తాను పెళ్లి చేసుకుంటానని పేర్కొన్నారు.

Read More »

సాధు అరుణాచలం – మేజర్ చాడ్విక్

మేజర్ చాడ్విక్ ఓ యూరోపియన్. ఆయన 1890 లో పుట్టారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఆయన ఓ మేజర్ గా పని చేశారు. యుద్ధరంగంలో రక్తపాతం చూసి ఆయన మనసు చలించింది. విరక్తి పుట్టింది

Read More »

భగవాన్ రమణ మహర్షి ముచ్చట

ఒకరోజు సాయంత్రం ఒక యువకుడు భగవాన్ రమణ మహర్షి దగ్గరకు వచ్చాడు. ముఖం చూస్తే అతను చాలా అమాయకుడిలా కనిపించాడు.
ఉదయం తొమ్మిది గంటలకు అతను భగవాన్ ని దర్శించుకున్నాడు.

Read More »

కథలు రాయాలన్న కోరిక సహజమే

రావి శాస్త్రి అనే రాచకొండ విశ్వనాధ శాస్త్రికి చిన్నప్పటి నుంచే కథలు రాయాలనే కోరిక ఉండేది. అయితే కథలు ఎలా రాయాలని ఆయన ఎవరెవరినో అడిగారు. కానీ ఎవరూ చెప్పలేదు. పైగా అప్పట్లో ఆయనకు రచయితలు ఎవరూ తెలీదు.

Read More »

ఓ కవి ప్రేమలేఖ

ప్రకృతి చెప్పేది ఒకటి…వివేకం నేర్పేది ఒకటి…అని కాకుండా ప్రకృతిలో ఉంటూ దానినే చదువుతూ దానితో కలిసి మాట్లాడుతున్నాం. అందుకే ఆనందం పొందుతున్నాం. ఆ ఆనందం ఏదో ఒక భాగం కాకుండా సంపూర్ణంగా చూస్తున్నాను.

Read More »

భువనవిజయ ఉత్పలమాల పద్యమాలిక

తొండమురాయుకున్తొలుత దోసిలియొగ్గుచుభక్తితోడనే
దండముచేయగామదిని దర్శనమిమ్మనివిఘ్నహారుడే
గండముతొల్గజేయనడకన్వడివచ్చెనుమాసుతుండునా
గుండెకునిండుగాముదముగూర్చెనునుత్పలమాలగైకొనెన్

Read More »