16న “ఊరుపేరు భైరవకోన”

ఈనెల 16న వస్తున్న “ఊరుపేరు భైరవకోన”

యువ హీరో సందీప్ కిషన్ గత కొన్నేళ్లుగా హిట్టు కొట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అసలు సందీష్ కిషన్ ఖాతాలో హిట్టు పడి చాలా ఏళ్లు అవుతోంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రేంజ్‌లో మళ్లీ సక్సెస్ చూడలేకపోయాడు సందీప్ కిషన్. ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నా కూడా, ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉన్నా కూడా విజయాన్ని మాత్రం అందుకోలేకపోతోన్నాడు. ఇప్పుడు ఊరుపేరు భైరవకోన అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.

ఈ మూవీ ఫిబ్రవరి 16న రిలీజ్ కానుంది. కానీ ఓ రెండ్రోజుల ముందే ప్రీమియర్లు పడుతున్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీని ఫిబ్రవరి 14న కొన్ని ఏరియాల్లో ప్రదర్శించబోతోన్నారు. ఆల్రెడీ టికెట్లు కూడా సేల్ అయిపోయాయి. బుకింగ్స్ జోరందుకోవడంతో వెంటనే అన్నీ హౌస్ ఫుల్స్ అయ్యాయి. చూస్తుంటే భైరవకోన సినిమా మీద ఎంతటి అంచనాలు అర్థం అవుతోంది.

Scroll to Top