All Sahityam

పద్యాలలో సంఖ్యావాచకాలు – 2

పుష్ప గృహ శయ్య పత్ని తాంబూల వస్త్ర
గంధ భూషణా లష్టభోగంబులగును
జగతి ధర్మార్థకామ మోక్షములు నాల్గు
ననిరి పురుషార్థములటంచు నార్యజనులు.

Read More »

దేవీ స్తోత్రాలు

అయిగిరినందిని ! నందితమోదిని ! విశ్వవినోదిని ! నందినుతే !
గిరివరవింధ్య శిరోధినివాసిని ! విష్ణువిలాసిని ! జిష్ణునుతే !
భగవతి ! హే శితికంఠకుటుంబిని ! భూరి కుటుంబిని ! భూరికృతే
జయ! జయ! హే మహిషాసురమర్దిని ! రమ్యకపర్దిని ! శైలసుతే !

Read More »

మృత్యపు వంతెన

మనిషికి, దేవునికి మధ్య వంతెన
భక్తా? భయమా? మృత్యువా ?
దేవుళ్ళ వలే పూజలందుకొనే
బాబాల్లారా ? స్వాముల్లారా? పీఠాధిపతుల్లారా ?
ఎక్కడున్నారు? ఏమైపోయారు మీరు ?
సామాన్యులకర్థంకాని సంస్కృతభాషలో
రోజూ తెగ పొగిడి, భజనలు చేసి పూజించే
మీ దేవుళ్ళు, దేవతలు ఏరి ? కనిపించరేరి?
రండి,.వచ్చి బతికించండి ఆ పిల్లలిని, తల్లుల్ల్ని?

Read More »

శాకోపనిషత్తు

ఆచార్య మసన చెన్నప్ప , అధ్యక్షులు, పాఠ్య ప్రణాళికా సంఘం, తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం గత సంవత్సరం శ్రీ సుద్దాల అశోక్ తేజా గారితో కలిసి ఆస్ట్రేలియా విచ్చేసిన సందర్భంగా వారి వ్యక్తి గత అనుభవాలు మరియు అనుభూతులతో “శుకోపనిషత్తు” అనే పద్య కావ్యాన్ని రచించారు. ఈ కావ్య గ్రంధాన్ని వరుస క్రమంలో మీ కోసం ప్రచురిస్తున్నాం.

Read More »

వెన్నెల వాకిలిలో వాలాను

అందంగా ఉన్నావంటే చాలు అమ్మాయి పడిపోతుంది
అవసరం లేకున్నా సరే కురులు సర్దుకుంటుంది
తెలివైన వాడివి అనగానే అబ్బాయి పడిపోతాడు
ఆడవారి మాటలకు అర్థాలే వేరని తెలుసుకోడు

ఆమె పెదవులపై వాలి గాలి పాటయ్యింది
ఆ పాట వింటుంటే ఆమే నా ప్రాణమయ్యింది

Read More »

ఆస్ట్రేలియా లో భారతీయులు

ఆంధ్ర దేశమవతరించె ఆస్ట్రేలియా ఖండమున
దేశమంటే మనుషులను సూక్తి నన్వయించి.
పుట్టింటి మమకారమొక వంక మొగ్గుచూప
సుఖ జీవన శైలి వీడలేని దైన్యము నెలకొని,
రెంటి నడుమ కొట్టు మిట్టాడు జీవితములనగ.

Read More »

వేసవి వేధించే వేళ!!!

వేసవి వేధించే వేళ
వెన్నెల వెదజల్లే వేళ
నా తలపు నీవైతే
నీ వలపు నాదైతే
వలపులో ఏది ఇక తీరిక
తలపులో లేదు నాకే కోరిక ……………. వేసవి

Read More »

ఓ తాతా జర చెప్పేదిను..

నేను పిసల్ బండ మీదికెల్లి, మేకల మండికి పోతన్న. నలుగురు మాకెలౌడెగాళ్ళు ఫుజూల్-గ నా మీదికొచ్చిండ్రు. మన ఇలాఖా గాదని జరంత తగ్గిన. మాంకాలమ్మ గల్లీలకు రాంగనే, నా ఎన్కనే ఉర్కుడు శురువు జేసిండ్రు. ఇదేందిరో ఈ సాలెగాండ్లు గిట్ల పిచాయిస్తుండ్రని, నేను గూడ ఉరుకుదామా అని అనుకుంటి. మన సందుల కొసింట్ల ఓ సాఫ్ట్ వేర్ పోరి లేదా.

Read More »

దుష్ట బాణ సంచా — శిష్ట జ్ఞానాకాంక్ష

విభజన బాణసంచా కి విరుగుడు గా విశాల భావాల తీపిని పంచాలి
అందరం ఉమ్మడి గా భాగ్య నగర నగారా మోగించాలి
ప్రాభవ మ్మందిన అఖండాంధ్రావని దీ దీపావళి యని యెం చాలి
దీపాలు వేరైనా ప్రతి దీపం లో దీపించే కాంతి ఒకటేనని గుర్తించాలి

Read More »