All Sahityam

నవ్వు–దాని వైఖరులు

నవ్వవు జంతువుల్,నరుడు నవ్వును. నవ్వులు చిత్తవృత్తికిన్ దివ్వెలు.కొన్ని నవ్వులెటు తేలవు. కొన్ని విషప్రయుక్తముల్. పువ్వులవోలె ప్రేమరసముల్, వెలిగ్రక్కు, విశుద్ధమైన లే నవ్వులు సర్వదుఃఖ దమనంబులు,వ్యాధులకున్ మహౌషధముల్. (కవికోకిల—–గుర్రం జాషువా) డాక్టరు “మదన్ కటారియా” అనే

Read More »

నీలాంబరి – వెన్నెల విరి

సమసమాజంలోని సమస్యల్ని వివిధ కోణాల్లో విశదీకరించి ప్రతీ పాత్రలో తన అనుభవాలను క్రోడీకరించి రచించిన కధల సంకలనం – నీలాంబరి. శ్రీమతి శారద గారు “భగవద్గీత” లోని 18 పర్వాలు లాగా ఈ పుస్తకంలో 18 కధలు వ్రాసారు. ప్రతీ కధ సమాజంలోని ఒక సమస్యను తీసుకొని అందులో అనువైన పాత్రలని సృష్టించి చదువరి ఆ పాత్రలో లీనమై పోయేట్లుగా వ్రాయడం శారద గారి కలంలో ప్రత్యేకత. తన చుట్టూ వున్న పరిసరాలను కూలంకుషంగా పరిశీలించి కధా వస్తువును మన తెలుగువారి పరిస్థితులకు అనుకూలంగా మలచి మంచి పదజాలంతో వ్రాసిన కధలివి.

Read More »

స్పూర్తి – మానవ మూర్తి

జాత్యహంకారముతో తెల్లవాళ్ళు
నల్లవార్ని అలుసుగా
నలుసులవలే నలిపేస్తూ
నరబలి కొనసాగిస్తూ
వారి దేశాన వారినే
బానిసలుగా మార్చేసి
పాలకులై పాలిస్తుంటే

Read More »

సమాజానికి వెచ్చని కంబలి!

మొదట చదివినప్పుడు “వంటి మీద దుప్పటి” అయ్యుంటుందిలే ఇదేదో అచ్చు తప్పు పడిందేమో అనుకున్నాను. చదివిన తరువాత గానీ శ్రీ శంకు గణపతి రావు గారు ఈ పేరెందుకు పెట్టారో అర్ధం అయ్యింది. పేరులాగానే ఒకసారి చదివితే శ్రీ గణపతి రావు గారు వ్రాసిన కధల్లోని గూఢర్ధాన్ని అన్వయించుకోలేము. ఇంతకు ముందు వ్రాసిన రెండు పుస్తకాలూ దేనికవే సాటి

Read More »

కడుపు కోత

భూమిలో కలిసిపోయాడు

గుండె గడియారాన్ని కాలంలోకి విప్పుకోకుండానే

సమయం లేదంటూ వెళ్ళిపోయాడు

అమ్మకు గర్భశోకాన్ని కానుకగా ఇచ్చి

ఈ లోకం మీద అలిగి అంతర్ధానమయ్యాడు

Read More »

ప్రభాత సమయం

ప్రభాత సమయం పరిమళ భరితం ,
రజనికి వీడుకోలు, రవికి స్వాగతం పలుకు ,
రసమయ తేజోమయం వింత వింత సుగంధ సమ్మిళిత
ఉత్కంట భరితo ఉషోదయం ||ప్రభాత ||

నల్లని నిశీధి నిండిన జగతి ని తెల తెల్లని
వెలుగురేఖలు మెల మెల్లగ వెల్లి విరియు ,

Read More »

సంక్రాంతి లక్ష్మి

స్వాగతం స్వాగతం ,సంక్రాంతి లక్ష్మికి
రెండువేల పదునాలుగు స్వాగతం,
వరికంకులొక చేత , సిరిసంపదలొ కచేత
ఎర్రకలువ మరియొక చేత,
శాంతి సౌభాగ్యములు వేరొకచేత
పట్టి ,విచ్చేయు సంక్రాంతి లక్ష్మికి స్వాగతం.

Read More »

కాగితం – పెన్నూ

ప్రేమా…..
నువ్వు పెన్నువి. నేను కాగితాన్ని.
ఏదైనా రాయి నీ హృదయంతో …
నువ్వు రాయడం కోసమే
నా హృదయాన్ని ఖాళీగా ఉంచాను.

నా నిద్రా ఒక కాగితమే
అందులో నువ్వు నీ కలలతో రాయి….

Read More »

జీవితం

మనిషి జీవితం మేఘంలాంటిది మేఘంలో మెరుపు కొంచమే నీరే అధికం మనిషి జీవితంలోను నవ్వులు కొంచం కన్నీరే అధికం పువ్వులపై మంచుబిందువులు ఉన్నట్లు నవ్వులోను కన్నీరు ఉంది నిజంచెప్పాలంటే నవ్వు అనేది కన్నీటి నూనెలో

Read More »