అమ్మ భాషే మన ఆయుధం

అమ్మ భాషే మన ఆయుధం

రెండేళ్ళ క్రితం తెలుగు భాషని కమ్యునిటీ భాషగా గుర్తించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య (FTAA – Federation of Telugu Associations in Australia) దరఖాస్తు పెట్టడం జరిగింది. అయితే 2011 గణాంకాల ప్రకారం ఇక్కడ నివసిస్తున్న తెలుగువారు కేవలం 7000 మంది కంటే తక్కువగా వున్న కారణంగా మరియు ఆంగ్ల భాషలో తెలుగువారు ప్రావీణ్యులు గనుక NAATI (National Accreditation Authority for Translators and Interpreters) వారు మన తెలుగు భాషను కమ్యునిటీ భాషగా గుర్తించడానికి సమ్మతించలేదు.

అయితే 2016లో జరిగిన సార్వత్రిక గణాంకాలను ఉద్దేశించి FTAA మరియు తెలుగుమల్లి ప్రోద్బలంతో చాలామంది తెలుగువారు తమ మాతృ భాషను “తెలుగు” గా నమోదు చేయడం జరిగింది. ఇందుమూలంగా ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పుడు తెలుగు మాట్లాడే వారి సంఖ్య షుమారు 36,000 కి దాటింది. ఇంకా చాలామంది ఈ ప్రక్రియలో పాల్గొనలేదనే చెప్పాలి. ఎందుకంటే ఆస్ట్రేలియాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య దాదాపు 70-80 వేల మధ్య ఉంటుందని అనధికార అంచనా.

మన భాషను కమ్యూనిటీ భాషగా గుర్తించడానికి FTAA వారు అంతర్జాలంలో ఒక అర్జీని తయారుచేసారు. దాని వివరాలు ఈ లింకులో ఉన్నాయి

మీరు దీనిపై ఆన్ లైన్ లో సంతకం చేయడానికి వీలున్నది.

తెలుగు కమ్యునిటీ భాషగా గుర్తింపబడితే వచ్చే ప్రయోజనాలు ఈ లింకు లో వివరింపబడ్డాయి.

తరతమ భేదాలు లేకుండా తెలుగు మాట్లాడే వారందరూ అమ్మ భాషను గౌరవిస్తూ ఉమ్మడిగా పోరాడుదాం. ఈ పోరాటంలో మలుపులే గానీ చివరికి గెలుపు మనదే. భావితరాలవారికి ఒక గొప్ప కానుకనిచ్చి చరిత్రపుటల్లో నిలిచిపోదాం. అందరూ ముందుకు వచ్చి దీనిపై సంతకం చేస్తే వచ్చే జనవరి/ఫిబ్రవరి నెలల్లో మరోమారు ఆస్ట్రేలియా ప్రభుత్వానికి తెలుగు భాషను కమ్యునిటీ భాషగా గుర్తించడానికి అర్జీని సమర్పించడం జరుగుతుంది.

మల్లికేశ్వర రావు కొంచాడ 

Send a Comment

Your email address will not be published.