అమ్మ భాష తెలుగే

అమ్మ భాష తెలుగే

అమ్మ భాష అమృతం అన్నారు పెద్దలు. అమ్మ భాష మాట్లాడాలని, అమ్మ భాష వినాలని, అమ్మ భాషలో పాడాలని – ప్రతీ నిమిషం అమ్మని గుర్తు చేసే చిరు జ్ఞాపకాలను నెమరువేయింపజేసేది అమ్మ భాష. ఎంతో మంది మాతృ ఋణం తీర్చుకోవాలన్న తపనతో అమ్మ భాషకు తమ జీవితాలను అంకితం చేసారు. అమ్మ భాష అమర భాషగా నిలిచిపోవాలని తపించారు. ఇప్పుడు ఈ అవకాశం మీకు కూడా వచ్చింది.

బహుళ సంస్కృతీ సాంప్రదాయాలకు పట్టంగట్టే ఆస్ట్రేలియా దేశంలో మన భాషకు అందలం పట్టాలన్న ఆకాంక్షతో ఆస్ట్రేలియా ప్రభుత్వానికి తెలుగు భాషను కమ్యూనిటీ భాషగా గుర్తించాలని గత ఏడాది ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య (Federation of Telugu Associations in Austrelia – FTAA) ఒక అర్జీ పెట్టడం జరిగింది. అయితే ప్రభుత్వ గణాంక వివరాల ప్రకారం తెలుగువారు 10,000 (2011 గణాంకాలు) కంటే తక్కువే వున్నారు. మరియు తెలుగువారు ఆంగ్లంలో చాలా వరకు పట్టు ఉన్నవారు గనుక సాధికారిక అనువాదుకుల అవసరం లేదని పైనుదహరించిన అర్జీని త్రోసిపుచ్చడం జరిగింది.

ప్రస్తుత మన కర్తవ్యం వచ్చే నెల జరగనున్న ఆస్ట్రేలియా సార్వత్రిక గణాంకాలలో ప్రతీ తెలుగువారు తమ మాతృ భాష తెలుగని వ్రాయడం చాలా ముఖ్యం. అడిగే ప్రశ్న ఇంచుమించుగా ఈ క్రింది విధంగా వుంటుంది:

Telugu_Census

తెలుగు వారందరూ పైన చూపిన విధంగా చివరి సమాధానం టిక్ చేసి “Telugu” అని వ్రాస్తే తెలుగు కమ్యూనిటీ భాషగా గుర్తింపబడడానికి ఎంతో దోహదపడుతుంది.

ఈ విషయాన్ని మీరందరూ మన తెలుగువారందరితో పేస్ బుక్ లోనూ, ఈమెయిలు లోనూ, పదిమంది కలిసినప్పుడు గానీ మరే ఇతర మాధ్యమాల్లో పంచుకొని అందరిచేత మాతృ భాష తెలుగుగా నమోదు చేయించాలని ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య మనవి చేసుకుంటుంది. తెలుగుమల్లి అర్దిస్తోంది.

Signature200px

Send a Comment

Your email address will not be published.